అమెరిక అధ్యక్షునిగా బరాక్ హుసేన్ ఒబామ చారిత్ర్యాత్మక గెలుపు అనంతరం మెక్ కెయిన్, అతని ప్రత్యర్ధి ఇచ్చిన కన్సెషన్ స్పీచ్ వినిన ఎలాంటి మానవుడైన చలించక మానడు, హృదయం ధ్రవించక పోదు, కళ్ళు చమర్చక మానవు. మెక్ కెయిన్ సందేశాన్ని విన్న అశేష అమెరిక ప్రజానీకం చేసినది కూడా అదే. మానవతా విలువలు అడుగంటి పోతున్న ఈ రోజులలో, రాజకీయలలో మానవతా విలువల ఆచరణ అసాధ్యం అనుకునే నేటి తరుణంలో మెక్ కెయిన్ సందేశం ప్రపంచానికి ఒక మేలుకొలుపు.

బరాక్ ఒబామాని అభినందిస్తూ మెక్ కెయిన్ ప్రారంభించిన సందేశంలోని ప్రతీ పదం మరపురానిది, మరచిపోలేనిది. ఒబామాకు, తనకు మధ్య సంబంధాన్ని చాలా క్లుప్తంగా, గంభీరంగా చెప్తూ "హి వాజ్ మై ఫార్మర్ అప్పొనెంట్ టుడే హి ఈజ్ మై ప్రెసిడెంట్" అన్నారు. ఈ విధంగా రాజకీయ ప్రత్యర్ధి గురించి మాట్లాడాలంటే మనిషి కి ఎంత విశాల హృదయం, ఉదార స్వభావం కావాలి? అంతే కాదు అహంభావానికి, అసూయకు, ఈర్ష్య, ధ్వేషాలకు తాను అతీతుడినని మెక్ కెయిన్ ఈ సందేశం ద్వార నిరూపించుకున్నారు.
"హిజ్ సక్సెస్ కమాండ్స్ మై రెస్పెక్ట్" అని కొనసాగిన అతని సందేశం ఒబామ గెలుపుని తాను గౌరవిస్తున్నట్లు చెపుతున్నది. "ముందుగా మేము అమెరికా పౌరులము, అమెరికాను శిఖరాగ్రాన నిలపడమే మా అందరి లక్ష్యం. ఈ లక్ష్యసాధన కోసం నేను నా పూర్తి సహకారాన్ని అందిస్తాను" అని వారు చేసిన వాగ్ధానం అసమానం, అపూర్వం.


అమెరికా లోని ఒక రాజకీయ ప్రత్యర్థి ఓడిన తరువాత గెలుపొందిన వ్యక్తిని ఉద్దేశించి దేశ భవితను కోరి ఇచ్చిన ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందే. ఒక రాజకీయ ప్రత్యర్ధి బాధ్యత, వైఖరి, ప్రవర్తన, ఆలోచన ఎలా ఉండాలి అనేవి ఈ సందేశంలో ప్రతిబింబిస్తున్నాయి. కొన్ని నెలలలో ఎన్నికలను ఎదుర్కొనబోతున్న ప్రతి భారతీయుడు దీని గురించి అలోచించాల్సిందే. ఈ రాజకీయ విజ్ఞత భారతీయులందరికి ఆదర్శం కావల్సిందే.

4 comments:

KumarN said...

Hi Shakira,
I am pasting a comment that I left on a different blog couple of days ago. Unfortunately I forgot whose blogs that was.

I couldn't control my tears..


-----------------------------------
చాలా చాలా థాంక్స్ అండీ ఇది రాసినందుకు.ఒక్కరైనా మెక్ కెయిన్ గురించి రాస్తారేమోనని చూసా మన తెలుగు బ్లాగుల్లో..
నాకు మెక్ కెయిన్ అంటే చాలా ఇష్టం అండి..ఇప్పుడే కాదు..2000 elections అప్పటినుంచీ కూడా.
అప్పుడు న్యూ హ్యాంప్ షైర్ ప్రైమరీలో బుష్ మీద గెలచి తర్వాత, సౌత్ కెరోలినాలో కార్ల్ రోవ్ అగ్లీ పొలిటిక్స్ బారినపడ్డాడు.(తన bangladesh adopted daughter rumors).

ఆయన మొదటినుంచీ కూడా నిజమైన Maverick.

ఆయన తన పార్టీకే చెందిన, politically highly influential and very conservative christian group కి చెందిన జెర్రీ ఫాల్ వెల్ ని, "దే ఆర్ ఏజెంట్స్ ఆఫ్ ఇన్ టాలరన్స్" అని పబ్లిగ్గ తెగడ్డం ఆయనొక్కడికే చెల్లింది.

ఆ రోజుల్లోనే పొలిటిక్స్ లో మనీ influence తగ్గించాలని ఆయన తాపత్రయ పడిన తీరూ, దానికోసం ఆయన ఆపోజిట్ పార్టీతో కలసి పనిచేసి Campaign finance reforms bill పాస్ చేసిన తీరూ..చాలా చాలా ప్రశంసనీయం. అలాగే ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్ బిల్ మీద, ఆయన తన సొంత పార్టీ లో రైట్ వింగ్ గ్రూప్ కి ఎదురుగా ఏమాత్రం భయపడకుండా, డెమొక్రటిక్ పార్టీతో కలసి పనిచేయటం చాలా శ్లాఘనీయం.

ఇరాక్ వార్ పీక్ రోజుల్లోనే, తన పార్టీకే చెందిన డిఫెన్స్ సెక్రటరీ Donald Rumsfeld ని పబ్లిగ్గా విమర్శించి, తన రాజీనామాని డిమాండ్ చేసిన ఒకే ఒక రిపబ్లికన్ ఆయన.

ఈ సారి కాంపయిన్ మొదలయ్యి ఇరాక్ వార్ విపరీతంగా అన్ పాపులర్ అయిన రోజుల్లో కూడా, I would rather loose an election, THAN LOOSE A WAR అని తన తలనూ, కలనూ, పణంగా పెట్టి Surge ని సపోర్ట్ చేసిన, శంకించలేని ఒక దేశభక్తుడీయన.

ఇక తన పర్సనల్ స్టోరీ గురించయితే చెప్పక్కర్లేదు..
వియత్నాం వార్ లో పి ఓ డబ్ల్యూ గా బంధింపబడి, వాళ్ళు ఆయన్ చేతులు విరిచేసింతర్వాత, మెక్ కెయిన్ నాన్న మిలటరీ లో చెప్పుకోతగ్గ పొజిషన్ లో ఉన్నాడని తెలుసుకొని, వాళ్ళు నువ్వు ఇంటికి వెంటనే వెళ్ళి పోవచ్చు అని ఆఫర్ చేసినా కూడా, లేదు నేను ముందు వెళ్ళను సీనియారిటీ లిస్ట్ ప్రకారం నా వంతు వచ్చినప్పుడే వెళ్తాను అని చెప్పి, ఇంకొన్నేళ్ళు స్వచ్చంధంగా జైలు జీవితం అనుభవించి, టార్చర్ చేయబడిన మహ యుద్ద ఖైదీ ఈయన.

సిండీ మెక్ కెయిన్ మదర్ థెరెసా ఆశ్రమం విజిట్ కి బంగ్లాదేశ్ వెళ్ళి, తను అక్కడికక్కడే నిర్ణయించేసుకొని, ఆ ఆశ్రమం లోంచి అమ్మాయిని పట్టుకొని అమెరికాకి తీసుకొచ్చి తన కూతుర్ని చేసుకుంటాను అని ఫీనిక్స్ ఏయిర్ పోర్ట్ లో ఆయనకు చెప్పినప్పుడు, ఒక్క ప్రశ్న కూడా వేయకుండా చిరునవ్వుతో ఇంటికి తీసుకెళ్ళిపోయిన మంచి మనిషి తను.

ఈసారి campaign లో కూడా, dirty racial politics వద్దు అనుకొని principle మీద నిలబడి, ఓబామా spiritual advisor, closest friend, his pastor who married him, baptized obama's two daugters అయిన Jeremiah Wright, 20 సంవత్సరాలుగా ఓబామా మొహం మీద anti-american poison, anti-white racial hatred poison spew చేస్తున్నప్పుడు ఒక spineless reptile గా నిలబడిపోయి, చేతకాని వెధవ లాగా, దేశభక్తి అణువు మాత్రం లేని ఒక చీమునెత్తురు లేని మనిషి లాగ నిలబడి పోయిన Obama ని ఆ ఇష్యూ మీద అటాక్ చేయలేదాయన..గ్యారంటీగా ఓడిపోతానని తెలిసిన చివరి రోజుల్లో కూడా..

తన కన్సెషన్ స్పీచ్ ఇవాళ మార్నింగ్ చూస్తుంటే తను
I would not be an American worthy of the name should I regret a fate that has allowed me the extraordinary privilege of serving this country for a half a century. Tonight, I remain her servant.
అన్నప్పుడు, ముఖ్యంగా ఐ రిమేయిన్ హర్ సర్వంట్ అన్న మాటల్లో గొంతు వణుకు, నన్ను ఉద్వేగ భరితుణ్ణి చేసి, దుఖంలో ముంచేసింది.
కన్నీళ్ళు ఆపుకోలేక బాత్రూం లోకి పోయి ఏడిచా.

Thanks again
-----------------------------------

Krishna K said...

మీరు అమెరికా రాజకీయాలకు క్రొత్త లాగా ఉన్నారు. ఇలాంటి speech లు కామనే. కాని మన రాజకీయనాయకులు ఇచ్చేవాటికంటే హుందాగా వుంటాయి. కాకపోతే వీలయినప్పుడల్లా కాళ్ల క్రింద వేరే party వాళ్ల carpet లాగేయటం లో మనవాళ్లకు వీళ్లు ఏ మాత్రం తీసిపోరు. అక్కడ వరకు ఎందుకు రాబోయే రోజులలో, ఓబామా కు republican party చుక్కలు ఎలా చూపిస్తుందో చూడంది ముక్యమ గా తనకు సెనేట్ లో 60 seats రాక పోవటం వలన.
నాకు 1992 లో clinton కు republicans ఎలాంటి చుక్కలు చూపించారో ఇంకా గుర్తు వుంది.
ఓబామా చేస్తానని చెప్పిన వాటిలో ప్రజలు ఎదురు చుసే universal healthcare ఒక్క అడుగు అయినా ముందుకు వేయనిస్తారేమో చూడండి. నాకు అప్పుడే republican ల నుండి , Insurance Company ల నుండి ఉత్తరాలు కూడ రావడం మొదలయ్యాయి, local chamber of commerce లో member ను అయిన పాపానికి.

Anil Dasari said...

మెకెయిన్ విజ్ఞత మన నాయకులందరికీ ఆదర్శం కావాలన్న మీ అభిప్రాయం సరైనదే. అందరూ కాకపోయినా, మనకీ కొందరు అటువంటి అగ్ర నాయకులున్నారు. ఉదాహరణకి, వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఓ సందర్భంలో మాజీ ప్రధాని పీవీని ఉద్దేశించి 'మేం అణు పరీక్షలు జరపగలిగామంటే దానికి పీవీ వేసిన బాటే కారణం' అన్నారు.

ఇక మెకెయిన్ - దాదాపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్ధులంతా వల్లె వేసే పలుకులే ఆయనా చెప్పారు. అందులో కొత్తేమీ లేదు. అది అక్కడో సత్సంప్రదాయం.

Shakira said...

కుమార్ గారు, మెక్ కెయిన్ గురించి చాలా విషయాలు చెప్పారు. కృతజ్ఞతలు. జీవితంలో ఇన్ని కష్టాలు ఎదుర్కొనబట్టేనేమో, ఆ స్పీచ్ లో చివరికి “most unfortunate” అంటూ..... కళ్ళల్లో నీళ్ళు క్రిందికి జారకుండా జాగ్రత్త పడ్డారు. ఆందుకే అవి మన కళ్ళల్లో నీళ్ళు తెప్పించ్చాయి.

కృష్ణ గారు, మీ ప్రతిస్పందనకు నా కృతజ్ఞతలు.

అబ్రకదబ్ర గారు, మీ రచనలు చదివాను ఆనందముతో పాటు ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. మీ ఆలోచనలూ, వాటికి మీరు ఇస్తున్న అక్షర రూపం రెండు చాలా బాగున్నాయి. ఏవరిని నొప్పించకా, సమకాలీన పరిస్థుతులతో రాజీ పడకా, వాటి మీద మీరు సాగిస్తున్న పోరాటం కొనసాగిస్తూనే ఉండాలి అని అశిస్తూ....