అమెరిక అధ్యక్షునిగా బరాక్ హుసేన్ ఒబామ చారిత్ర్యాత్మక గెలుపు అనంతరం మెక్ కెయిన్, అతని ప్రత్యర్ధి ఇచ్చిన కన్సెషన్ స్పీచ్ వినిన ఎలాంటి మానవుడైన చలించక మానడు, హృదయం ధ్రవించక పోదు, కళ్ళు చమర్చక మానవు. మెక్ కెయిన్ సందేశాన్ని విన్న అశేష అమెరిక ప్రజానీకం చేసినది కూడా అదే. మానవతా విలువలు అడుగంటి పోతున్న ఈ రోజులలో, రాజకీయలలో మానవతా విలువల ఆచరణ అసాధ్యం అనుకునే నేటి తరుణంలో మెక్ కెయిన్ సందేశం ప్రపంచానికి ఒక మేలుకొలుపు.
బరాక్ ఒబామాని అభినందిస్తూ మెక్ కెయిన్ ప్రారంభించిన సందేశంలోని ప్రతీ పదం మరపురానిది, మరచిపోలేనిది. ఒబామాకు, తనకు మధ్య సంబంధాన్ని చాలా క్లుప్తంగా, గంభీరంగా చెప్తూ "హి వాజ్ మై ఫార్మర్ అప్పొనెంట్ టుడే హి ఈజ్ మై ప్రెసిడెంట్" అన్నారు. ఈ విధంగా రాజకీయ ప్రత్యర్ధి గురించి మాట్లాడాలంటే మనిషి కి ఎంత విశాల హృదయం, ఉదార స్వభావం కావాలి? అంతే కాదు అహంభావానికి, అసూయకు, ఈర్ష్య, ధ్వేషాలకు తాను అతీతుడినని మెక్ కెయిన్ ఈ సందేశం ద్వార నిరూపించుకున్నారు.
"హిజ్ సక్సెస్ కమాండ్స్ మై రెస్పెక్ట్" అని కొనసాగిన అతని సందేశం ఒబామ గెలుపుని తాను గౌరవిస్తున్నట్లు చెపుతున్నది. "ముందుగా మేము అమెరికా పౌరులము, అమెరికాను శిఖరాగ్రాన నిలపడమే మా అందరి లక్ష్యం. ఈ లక్ష్యసాధన కోసం నేను నా పూర్తి సహకారాన్ని అందిస్తాను" అని వారు చేసిన వాగ్ధానం అసమానం, అపూర్వం.
అమెరికా లోని ఒక రాజకీయ ప్రత్యర్థి ఓడిన తరువాత గెలుపొందిన వ్యక్తిని ఉద్దేశించి దేశ భవితను కోరి ఇచ్చిన ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందే. ఒక రాజకీయ ప్రత్యర్ధి బాధ్యత, వైఖరి, ప్రవర్తన, ఆలోచన ఎలా ఉండాలి అనేవి ఈ సందేశంలో ప్రతిబింబిస్తున్నాయి. కొన్ని నెలలలో ఎన్నికలను ఎదుర్కొనబోతున్న ప్రతి భారతీయుడు దీని గురించి అలోచించాల్సిందే. ఈ రాజకీయ విజ్ఞత భారతీయులందరికి ఆదర్శం కావల్సిందే.
Subscribe to:
Posts (Atom)